ఇక ఆలస్యం చేయలేం.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ఐరాస మద్దతు..
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:05 AM
భద్రతా మండలి ప్రస్తుత నిర్మాణం 21వ శతాబ్దపు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని, సంస్కరణలు చేయడంలో ఇకపై ఆలస్యం చేయలేమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ పేర్కొన్నారు
ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో సంస్కరణలు తీసుకురావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ డిమాండ్‌కు ఐరాస మద్దతు లభించింది. భద్రతా మండలి ప్రస్తుత నిర్మాణం 21వ శతాబ్దపు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేదని, సంస్కరణలు చేయడంలో ఇకపై ఆలస్యం చేయలేమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ పేర్కొన్నారు (UNSC reform)
ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే అధికారం కొన్ని దేశాల వద్దే కేంద్రీకృతమై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు ప్రారంభ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుత భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉండటం 2026 నాటి ప్రపంచ వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించడం లేదని అన్నారు. అతిపెద్ద జనాభా కలిగిన దేశం, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అయిన భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో భాగస్వామ్యం లేకపోవడాన్ని ప్రధాని ప్రశ్నించారు (PM Modi BRICS 2026).
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ స్పందించారు (India permanent UNSC seat). యూఎన్‌ఎస్‌సీలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై ఆలస్యం చేయడం మంచిది కాదన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఐరాస వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉందని దుజారిక్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓకు మస్క్, ఆల్ట్‌మన్ మద్దతు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..