Share News

రాజేష్ ఖన్నా కేసులో బాలీవుడ్ నటికి ఎదురుదెబ్బ!

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:40 PM

బాలీవుడ్ దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఆస్తులు, ఆయనతో ఉన్న సంబంధంపై సుధీర్ఘ కాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో నటి అనితా అద్వానీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

రాజేష్ ఖన్నా కేసులో బాలీవుడ్ నటికి ఎదురుదెబ్బ!
Anita Advani Petition

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఆస్తులు, ఆయనతో ఉన్న సంబంధంపై సుధీర్ఘ కాలంగా సాగుతున్న న్యాయ పోరాటంలో నటి అనితా అద్వానీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. రాజేష్ ఖన్నాతో తనకున్న బంధాన్ని వివాహంగా గుర్తించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పిటిషన్‌ను 'విలాసవంతమైన వ్యాజ్యం' గా సుప్రీంకోర్టు అభివర్ణించింది. రాజేష్ ఖన్నాతో అనితా అద్వానీ బంధం వివాహ స్వభావం కాదన్న బాంబే హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.


2012లో రాజేష్ ఖన్నా మరణం తర్వాత 'ఆశీర్వాద్' బంగ్లా నుంచి తనను వెళ్లగొట్టారంటూ ఖన్నా కుటుంబ సభ్యులైన డింపుల్ కపాడియా, ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్‌లపై అనితా అద్వానీ పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘకాలం సాగిన కేసుపై అనితా పోరాటం ముగిసింది. గృహహింస చట్టం కింద జీవన భృతి, ఫ్లాట్ కోరిన పిటిషనర్‌ అనితా అద్వానీకి ఉపశమనం దక్కలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో అనితకి మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఈ తీర్పుతో ఖన్నా కుటుంబ సభ్యులు డింపుల్ కపాడియా, ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్‌లకు పెద్ద ఊరట లభించింది.


ఇవి కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Updated Date - Oct 29 , 2026 | 08:09 PM