Share News

స్టాలిన్.. దేశం గురించి ఆలోచించండి: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Nov 28 , 2026 | 09:36 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు మద్దతు ప్రకటించిన డీఎంకే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

స్టాలిన్.. దేశం గురించి ఆలోచించండి: రాహుల్ గాంధీ
MK Stalin, Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు మద్దతు ప్రకటించిన డీఎంకే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. పార్టీలు, రాజకీయ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యమని పేర్కొన్నారు. డీఎంకేతో పాటు ఎన్డీఏలోని దక్షిణాది పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఈ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు (Rahul Gandhi, MK Stalin).


శనివారం ఢిల్లీలో ప్రతిపక్ష నేతల సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు దానికి విఘాతం కలిగిస్తున్నారు? అన్నది ఈ పోరాటంలో తేలిపోతుందని అన్నారు. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే తమ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరారు (DMK Delimitation Bill).


లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు (Delimitation Bill 2026). మహిళా రిజర్వేషన్ల అమలుకు ఇంత పెద్ద సంఖ్యలో స్థానాలను పెంచాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని వాదించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ఎన్నికల పటాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..


ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..

Updated Date - Nov 28 , 2026 | 09:36 PM