స్టాలిన్‌ను సావర్కర్ 2.0తో పోల్చిన టీవీకే.. డీలిమిటేషన్‌పై డీఎంకేకు కౌంటర్..
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:45 PM
మిళనాడు రాజకీయ పార్టీల మధ్య డీలిమిటేషన్ బిల్లు చిచ్చు రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంతో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయ పార్టీల మధ్య డీలిమిటేషన్ బిల్లు చిచ్చు రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంతో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్‌పై ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే తీవ్ర విమర్శలు చేసింది. స్టాలిన్‌ను 'సావర్కర్ 2.0' అంటూ అభివర్ణించింది. ఈ మేరకు టీవీకే ఐటీ విభాగం 'ఎక్స్'లో ఓ ఫోటోను పోస్టు చేసింది (MK Stalin vs Vijay TVK).
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించిన కొద్దిసేపటికే టీవీకే ఐటీ విభాగం 'ఎక్స్'లో స్టాలిన్ చిత్రాన్ని పోస్టు చేసింది. అందులో ఆయనను ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి, 'స్టాలిన్ అలియాస్ సావర్కర్ 2.0' అనే వ్యాఖ్యను జత చేసింది. మరో పోస్టులో స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను కూడా ఆర్ఎస్ఎస్ దుస్తుల్లో చూపిస్తూ విమర్శలు చేసింది. 'సనాతనం కాదు.. సొన్ ధనం' అనే తమిళ పదప్రయోగంతో మరో సెటైర్ వేసింది (DMK Delimitation Bill).
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును డీఎంకే గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది (Tamil Nadu Politics). జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కేంద్రం తాజాగా తీసుకొచ్చిన బిల్లుకు మద్దతు తెలిపింది. తాజా ప్రతిపాదనలో తమ రెండు ప్రధాన డిమాండ్లను లిఖితపూర్వకంగా చేర్చారని స్టాలిన్ తెలిపారు. అందుకే బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..
ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..