మతపర కార్యక్రమానికి కులం రంగు పులిమిన రాహుల్
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:00 AM
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి కులం రంగు పులిమారని ఆరోపిస్తూ విపక్షనేత రాహుల్ గాంధీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాం సేన...
కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు
హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం
హల్ద్వానీ, ఆగస్టు 30: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి కులం రంగు పులిమారని ఆరోపిస్తూ విపక్షనేత రాహుల్ గాంధీపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాం సేన ధర్మరథ్ సేవా న్యాస్ సభ్యుడు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అమిత్ కుమార్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు. హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఈ నెల 8న జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనగా దళితుడున్న కారణంతో కొందరు ఈ నెల 11న ఆ స్థలాన్ని శుద్ధి చేశారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వానికి ఇది నిదర్శనమని విమర్శించారు. అయితే రాహుల్ వాస్తవాలను వక్రీకరించారని అమిత్ కుమార్ ఆరోపించారు. ఈ నెల 11న మతపరమైన శుద్ధి యజ్ఞం జరిగిందని, దానికి ఎస్సీలు, ఎస్టీలు సహా అన్నివర్గాల వారు హాజరయ్యారని చెప్పారు. ఒక కులానికి వ్యతిరేకంగా జరగలేదని తెలిపారు. అందువల్ల రాహుల్‌పైనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఇంకా కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదును జిల్లా సీనియర్ ఎస్పీకి, జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపించామని స్థానిక పోలీసు అధికారి ఆదివారం చెప్పారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News