ప్రపంచ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మారింది.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:57 AM
ప్రపంచ రాజకీయాల్లో భారత్ తన ప్రాధాన్యతను కోల్పోయిందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాల్సిన భారత్ ఇప్పుడు పక్కకు తప్పుకుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ రాజకీయాల్లో భారత్ తన ప్రాధాన్యతను కోల్పోయిందని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించాల్సిన భారత్ ఇప్పుడు పక్కకు తప్పుకుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో తాజాగా విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడ్లారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇప్పుడు కేవలం సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు (Rahul Gandhi US Visit).
ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పాకిస్థాన్ చురుగ్గా వ్యవహరిస్తుంటే, భారత్ మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమైందని రాహుల్ విమర్శించారు. జనాభా, ఆర్థిక శక్తి, అంతర్జాతీయ స్థాయి దృష్ట్యా ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు సహజంగానే కీలక స్థానం ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో తనకున్న వ్యక్తిగత స్నేహాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంటారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఒక దేశ విదేశాంగ విధానం కేవలం నేతల మధ్య స్నేహ సంబంధాల ఆధారంగా ఉండకూడదని అన్నారు. భారత్ తన సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ వేదికలపై స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు (Rahul Gandhi about PM Modi).
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీని పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిగా అభివర్ణించింది (BJP fires on Rahul Gandhi). విదేశీ గడ్డపై భారత్ అంతర్జాతీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ విమర్శించారు. ప్రపంచ రాజకీయాలపై అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారీ పాకిస్థాన్‌ను ఆదర్శంగా చూపిస్తున్నారని బీజేపీకి చెందిన మరో అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. రాహుల్‌ను 'పాక్ ఫ్యాన్ బాయ్'గా అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి..
గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్
బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..