Raghav Chadha: బ్లింకిట్ డెలివరీ బాయ్‌గా రాఘవ్ చద్దా
ABN , Publish Date - Jan 12 , 2026 | 08:06 PM
చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు. పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు.
న్యూఢిల్లీ: గిగ్ వర్కర్ల సమస్యలను పార్లమెంటులో ఇటీవల లేవనెత్తిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadaha) తాజాగా బ్లింకిట్ డెలివరీ బాయ్ (Blinkit Rider) అవతారం ఎత్తారు. డెలివరీ ఏజెంట్ దుస్తులు ధరించి కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేశారు. 'బోర్డు రూములకు దూరంగా అట్టడుగు స్థాయిలో.. ఐ లివ్డ్ దైర్ డే..' అంటూ ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో బ్లింకిట్ యూనిఫారం వేసుకున్న చద్దా డెలివరీ బ్యాగ్ తగిలించుకుని రైడర్‌తో కలిసి ప్రయాణం సాగించారు. స్టోర్‌లో వస్తువులు కలెక్ట్ చేసుకుని డెలివరీ లొకేషన్‌కు బయలుదేరారు. అక్కడకు చేరుకోగానే లిఫ్ట్ ఎక్కి రైడర్‌ను చద్దా అనుసరించారు. 'స్టే ట్యూన్డ్' అంటూ ఆ వీడియో ముగుస్తుంది.
చద్దా ఇటీవల గిగ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మె జరిపిన న్యూఇయర్ ఈవ్‌లో పాల్గొన్నారు. పని గంటలతో సహా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గిగ్ వర్కర్లు ఈ ఆందోళన జరిపారు. కస్టమర్లకు పది నిమిషాల్లో డెలివరీ ఇస్తామంటూ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు ఇస్తున్న హామీలతో చద్దా విభేదిస్తున్నారు. ఇలాంటి డెడ్‌లైన్‌ల వల్ల రైడర్లపై ఒత్తిడి పెరుగుతుందని, భద్రతతో రాజీ పడాల్సి వస్తుందని అంటున్నారు. ఇదే విషయాన్ని గత ఏడాది రాజ్యసభ జీరో అవర్‌లో చద్దా ప్రస్తావించారు. జనం రోబోలు కాదని, వాళ్లలోనూ తండ్రులు, భర్తలు, సోదరులు, కుమారులు ఉన్నారని అన్నారు. వారి గురించి సభ ఆలోచించాలని కోరారు. 10 నిమిషాల్లో డెలివరీ అనే క్రూర నిబంధనకు తెరపడాలని అన్నారు. తాజాగా, వారి కష్టనష్టాలను స్వయంగా తెలుకునేందుకు డెలివరీ బాయ్‌గా ఆయన అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి