Share News

మోదీ ప్రసంగంలో నెహ్రూ పేరు వినిపించకపోవడం గమనార్హం: ప్రియాంక

ABN , Publish Date - Apr 16 , 2026 | 07:11 PM

పార్లమెంట్ సమావేశాల్లో మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం లోక్‌సభ సీట్ల పెంపుపైనే ఆసక్తి కనబరుస్తోందని ఆమె విమర్శించారు.

మోదీ ప్రసంగంలో నెహ్రూ పేరు వినిపించకపోవడం గమనార్హం: ప్రియాంక
Priyanka Gandhi at Parliament

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రసగించారు. అంతకముందు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని తప్పుపట్టిన ఆమె.. అందులో జవహర్‌లాల్ నెహ్రూ పేరు వినిపించకపోవడం గమనార్హం అని అన్నారు. మహిళల హక్కుల పట్ల బీజేపీ నేతలే ఛాంపియన్లుగా భావిస్తున్నారని ఆమె విమర్శించారు.


'మోదీ ప్రసంగంలో నెహ్రూ పేరు వినిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రిజర్వేషన్లపై 2018లోనే ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. 2019లోపే రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్‌ కోరారు. ప్రధాని మోదీ సగం సమాచారం మాత్రమే వెల్లడించారు. ఇవాళ ప్రధానంగా రిజర్వేషన్ల కోటాపై చర్చ కాదు.. లోక్‌సభ సీట్లను 850కి పెంచడంపైనే. మోదీ ప్రభుత్వం లోక్‌సభ సీట్ల పెంపుపైనే ఆసక్తి కనబరుస్తోంది. ఆ విషయంలో ప్రభుత్వానికి అంత తొందరెందుకు?' అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.


మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. 'మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు. రాహుల్‌ స్వయంగా మోదీ దగ్గరకు వెళ్లి మరీ మద్దతు తెలిపారు. ఆ బిల్లుపై క్రెడిట్‌ను మోదీ.. కాంగ్రెస్‌కు ఇవ్వలేదు. దేశ మహిళలకు కాంగ్రెస్‌ ఎంతో సేవ చేసింది. బిల్లు విషయంలో మహిళలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోంది. మహిళా బిల్లును ఎవరు వ్యతిరేకిస్తున్నారో మోదీ చెప్పాలి. కులగణనకు మోదీ ఎందుకు భయపడుతున్నారు? ఓబీసీలకు న్యాయం జరగాలి.. వారి హక్కులను ఎవరూ కాలరాయలేరు' అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.


ఇవీ చదవండి:

ఈ రాజ్యాంగ సవరణ బిల్లు దేశ చరిత్రలోనే గొప్పది: ప్రధాని మోదీపార్లమెంట్

సాక్షిగా తెలంగాణకు అవమానం జరిగింది: మంత్రి పొన్నం

Updated Date - Apr 16 , 2026 | 07:26 PM