Share News

రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:41 PM

రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayana Singh) తిరిగి రాజ్యసభకు రానున్నారు. ఆయనను రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు.

రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Harivansh Narayan singh

న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayana Singh) తిరిగి రాజ్యసభకు రానున్నారు. ఆయనను రాజ్యసభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. ఈ మేరకు శుక్రవారంనాడు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. బిహార్‌ నుంచి జేడీ(యూ) సభ్యుడిగా ఉన్న హరివంశ్ పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. 2018 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ వ్యవహరిస్తున్నారు.


రాజ్యాంగంలోని సెక్షన్3 లోని క్లాజ్ (1), సబ్ సెక్షన్ (ఎ) కింద 69 ఏళ్ల హరివంశ్‌ను రాష్ట్రపతి నామినేట్ చేశారు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడైన రంజన్ గొగోయ్ ఇటీవల పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. హరివంశ్‌ను నామినేట్ చేయడంతో ఈ ఖాళీని భర్తీ చేశారు.


కాగా, హరివంశ్‌కు విశేషమైన పార్లమెంటరీ అనుభవం ఉంది. ఎగువ సభలో వివిధ కీలక కమిటీలకు ఆయన సేవలందించారు. 2014లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో పార్లమెంటరీ జర్నీని ఆయన ప్రారంభించారు. 2020లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్‌గా, గత బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ స్వీకర్‌గా వ్యవహరించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సభను నడిపించిన తీరు అధికార, ప్రతిపక్షాల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి..

సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదం.. పవన్ ఖేడాకు ముందస్తు బెయిలు

మహిళా రిజర్వేషన్లపై బీజేపీ ‘మాస్టర్ ప్లాన్’.. పార్లమెంటు బిల్లుకు ముందే దేశవ్యాప్త ప్రచారం!

Updated Date - Apr 10 , 2026 | 03:44 PM