పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:26 PM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. శుక్రవారం ‘సంకల్ప పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
కోల్‌కతా, ఏప్రిల్ 10: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. శుక్రవారం ‘సంకల్ప పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్‌లో ప్రతి మహిళకు నెలకు 3 వేల రూపాయలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో యూసీసీ అమలు చేస్తామని చెప్పారు. సెవెన్త్ పే కమిషన్ అమలు చేస్తామని అన్నారు. యువతకు నెలకు 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ధాన్యానికి 3,100 రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘బెంగాల్ అభివృద్ధికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్ తయారు చేస్తాం. గర్భిణీలకు రూ.21వేల సాయం అందిస్తాం. ఉత్తర బెంగాల్‌లో ఐఐటీ, ఐఐఎం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పిస్తాం. బెంగాల్‌లో చీకటి పాలన ముగుస్తుంది. అధికార టీఎమ్‌సీ అవినీతి పాలన అంతం కానుంది. బెంగాల్‌లో చొరబాట్లను అడ్డుకుంటాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వేసవిలో స్కిన్ కేర్ సీక్రెట్స్.. టాన్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు
ముంబై ఎయిర్‌పోర్టులో.. 29 కిలోల బంగారం సీజ్..