Share News

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీకి శిక్ష విధించాలి: ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 23 , 2026 | 02:11 PM

ఇవాళ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఎన్నికల ప్రచార సభకు బెంగాల్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీకి శిక్ష విధించాలి: ప్రధాని మోదీ
Narendra Modi

ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ(గురువారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఎన్నికల ప్రచార సభకు బెంగాల్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ, కాంగ్రెస్ కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారని ప్రధాని మోదీ అన్నారు.


'మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీకి శిక్ష విధించాలి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ఈసీకి అభినందనలు. బెంగాల్‌లో టీఎంసీ జంగిల్ రాజ్ ముగిస్తున్నాం. మమత పాలనలో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మమత చేసిన దుర్మార్గాలపై విచారణ చేస్తాం. బెంగాల్‌లోకి చొరబాటు దారులను టీఎంసీ ప్రోత్సహిస్తుంది. సరిహద్దు భద్రతను, ప్రమాదంలో పడేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిఎంసి అవినీతిని కక్కిస్తాం' అని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఇవాళ(ఏప్రిల్ 23) జరుగుతోంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తోన్నారు . మిగిలిన ప్రాంతాల‍్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బెంగాల్లో పర్యటించారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం..

పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగవచ్చంటూ వార్త.. ఖండించిన కేంద్రం

Updated Date - Apr 23 , 2026 | 02:28 PM