Share News

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 02:00 PM

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, సంబంధిత వీడియోలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది.

అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
Arvind Kejriwal Notice

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. కేజ్రీవాల్ వాదనలకు సంబంధించిన వీడియోలను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది.


కోర్టు నిబంధనలను ఉల్లంఘించి వీడియోలు రికార్డ్ చేశారని, దీనిపై విచారణ జరపాలని న్యాయవాది వైభవ్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వ్యవహరించారని పిటిషనర్‌ వాదించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌తో పాటు సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం..

పెట్రోల్, డీజిల్ ధరలు రూ.28 మేర పెరగవచ్చంటూ వార్త.. ఖండించిన కేంద్రం

Updated Date - Apr 23 , 2026 | 02:02 PM