వేదికపై 97 ఏళ్ల మాఖన్ లాల్ కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ.. ఇంతకీ ఎవరతను..
ABN , Publish Date - May 09 , 2026 | 11:57 AM
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు మాఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు మాఖన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (PM Modi Makhanlal Sarkar).
వేదికపై మాఖన్ లాల్ సర్కార్‌ను సన్మానించి, కౌగలించుకున్న ప్రధాని, అనంతరం ఆయన కాళ్లకు నమస్కరించారు. బెంగాల్‌లోని సిలిగురికి చెందిన మాఖన్ లాల్ సర్కార్ బీజేపీ సీనియర్ నాయకుడు. ఆయన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సన్నిహితుడిగా మెలిగారు. ఆయనకు సహాయకుడిగా పని చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం జరిగిన అంతిమ యాత్రలో కూడా మాఖన్ లాల్ పాల్గొన్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు (Makhanlal Sarkar who is he).
అలాగే, కాంగ్రెస్ పాలన సమయంలో దేశభక్తి గీతం పాడినందుకు ఢిల్లీ పోలీసులు మాఖన్ లాల్ సర్కార్‌ను అరెస్టు చేసిన సంఘటనను కూడా బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు (Shyama Prasad Mookerjee aide). కోర్టులో క్షమాపణ చెప్పడానికి కూడా మాఖన్ లాల్ నిరాకరించారట. కోర్టులో కూడా అదే పాటను మళ్లీ పాడారట. దీంతో న్యాయమూర్తి.. మాఖన్ లాల్ తిరుగు ప్రయాణ ఖర్చులకు అవసరమైన వంద రూపాయలు ఇవ్వాలని ఆదేశించారట. బెంగాల్‌లో తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ సీనియర్ నాయకుడికి బీజేపీ నేతలు తగిన గౌరవం కల్పించారు.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..