నెదర్లాండ్స్ ప్రధానికి ప్రధాని మోదీ అరుదైన కానుక
ABN , Publish Date - May 21 , 2026 | 11:25 AM
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ పర్యటించారు.
న్యూఢిల్లీ, మే 21: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటన ముగించుకుని గురువారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని రాబ్ జెట్టెన్‌కి చేపల ఆకృతితో ఉన్న మధుబని పెయింటింగ్‌ను బహుమతిగా ప్రధాని మోదీ అందజేశారు. ఈ మధుబని పెయింటింగ్ అత్యంత ప్రాచీనమైనది. ఈ పెయింటింగ్ భౌగోళిక గుర్తింపు పొందింది.
జానపద కళను ప్రతిబింబించే ఈ పెయింటింగ్‌లు.. భారత్, నేపాల్‌లోని మిథిలా ప్రాంతంలో ఉంటాయి. పండగలు, వివాహాలు, ఆచార వ్యవహారాలు తదితర శుభకార్యాలకు సూచికగా ఈ పెయింటింగ్స్ వేస్తారు. ఈ మధుబని పెయింటింగ్స్‌కు సంబంధించిన మూలాలు భారతీయ పురాణాలు, జానపద కథల్లో ఉన్నాయి. పువ్వులు, పక్షులు, చెట్లు, చేపల వంటి ఆకృతుల ద్వారా దేవతలు, ప్రకృతితోపాటు రోజువారీ జీవిత దృశ్యాల ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. నెదర్లాండ్స్ ప్రధానికి ఈ కానుక ఇవ్వడం ద్వారా భారతీయ సంస్కృతి, ముఖ్యంగా మిథిలా కళారూపాన్ని పరిచయం చేసినట్లు అయిందనే చర్చ సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. 23 మంత్రుల ప్రమాణస్వీకారం
కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రక్షాళనకు వేళయిందా?
For More National news And Telugu News