తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. మంత్రుల ప్రమాణస్వీకారం
ABN , Publish Date - May 21 , 2026 | 11:12 AM
తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. నేడు కొత్తగా 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్ తన కేబినెట్‌ను విస్తరించారు. కొత్తగా 23 మంది ఎమ్మెల్యేలు నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 21 మంది టీవీకే ఎమ్మెల్యేలతో పాటు మిత్రపక్షం కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటుదక్కింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌తో పాటు ఐయూఎమ్ఎల్, వీసీకే పార్టీలకు కూడా సీఎం విజయ్ కేబినెట్ బెర్తు ఆఫర్ చేశారు. అయితే, మరికొంతకాలం తరువాత ఐయూఎమ్ఎల్, వీసీకేలు కేబినెట్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎంలను కూడా సీఎం విజయ్ మంత్రివర్గంలోకి ఆహ్వానించినట్టు మంత్రి ఆధవ్ అర్జున మంగళవారం తెలిపారు. వీసీకే చీఫ్ తోల్ తిరుమావళన్ మంత్రివర్గంలో చేరాలని తాము ఆశిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.
మే 10న జరిగిన ప్రమాణస్వీకారంలో విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక తమిళనాడు కేబినెట్‌లో గరిష్ఠంగా 35 మంది మంత్రులకు అవకాశం ఉంది. తాజాగా 23 ఎమ్మెల్యేలు మంత్రులుగా చేరడంతో మంత్రి వర్గం సంఖ్య 32కు చేరింది. దీంతో, మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటుదక్కే ఛాన్స్ ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రక్షాళనకు వేళయిందా?