Share News

సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:13 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి.

సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..
PM Modi football Gangtok

భారత ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లో సందడి చేశారు. యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. సిక్కిం రాష్ట్ర అవతరణ జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ముగింపు వేడుకల కోసం ప్రధాని గ్యాంగ్‌టక్ చేరుకున్నారు (PM Modi football Gangtok).


అధికారిక కార్యక్రమాలకు ముందు గ్యాంగ్‌టక్‌లో యువతతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. యువతతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. 'గ్యాంగ్‌టక్‌లో ఉదయం యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడడం చాలా ఎనర్జీ ఇచ్చింది' అని మోదీ పేర్కొన్నారు (Modi Sikkim visit 2026).


కాగా, సిక్కింలో ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు (Sikkim statehood celebration). సిక్కింలో రహదారుల కనెక్టివిటీ, ఆరోగ్యం, టూరిజం, విద్య, నగర అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రూ.4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.


ఇవి కూడా చదవండి..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..


బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 28 , 2026 | 11:16 AM