రాష్ట్రపతికి అవమానం.. హద్దుమీరారంటూ మమతపై మోదీ ఆగ్రహం
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:14 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమబెంగాల్‌లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పశ్చిమబెంగాల్‌లో పాల్గొనాల్సిన అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ వేదికను మార్చడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata B Banerjee) ఆ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది సిగ్గుచేటని, మునుపెన్నడూ జరగలేదని టీఎంసీ పైన, మమతా బెనర్జీ ప్రభుత్వంపైన మండిపడ్డారు.
'ఇది సిగ్గుచేటు వ్యవహారం. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతకపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరి నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఈ చర్య ఉంది. గిరిజన కమ్యూనిటీకి చెందిన రాష్ట్రపతి వెలిబుచ్చిన ఆవేదన దేశ ప్రజల మనసుల్లో ఆపార దుఃఖాన్ని కలిగించింది' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మోదీ ట్వీట్ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు అతిక్రమించిందనీ, రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ప్రభుత్వ యంత్రాగానిదే బాధ్యత అని అన్నారు.
ఏమిటీ వివాదం
ఉత్తర బెంగాల్‌లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు హాజరయ్యేందుకు రాష్ట్రపతి సిలిగురికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతికి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, సీనియర్ అధికారులు కానీ స్వాగతం పలకాల్సి ఉంది. అయితే అధికారికంగా స్వాగతించడానికి ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు. ముందుగా అనుకున్న సదస్సు వేదికకు భద్రతా కారణాలతో ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. దీనికి కారణం ఏమిటో వారికే తెలియాలని, అయితే తనపై మమత ప్రభుత్వంపై ఎలాంటి ద్వేషంలేదని, ఆమె తనకు సోదరితో సమానమని అన్నారు. తాను కూడా బెంగాల్ కూతుర్నేనని గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రపతి ఈవెంట్‌కు మమత డుమ్మా.. ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన
విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్