విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:48 PM
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన ఆయన భార్య సంగీత తాజాగా మరో పిటిషన్ వేశారు. నివాస హక్కులు కోరుతూ ఈ పిటిషన్ వేశారు.
చెన్నై: తమిళ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన ఆయన భార్య సంగీత (Sangeetha) తాజాగా మరో పిటిషన్ వేశారు. నివాస హక్కులు కోరుతూ ఈ పిటిషన్ వేశారు. వివాహం తర్వాత తాము కలిసి నీలాంగరైలో నివసించిన వైవాహిక గృహం (Matraimonial home)లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ చెంగల్పట్టులోని జిల్లా కోర్టును ఆమె ఆశ్రయించారు. దీనిపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
విజయ్ నుంచి విడాకులు కోరడంతో ఇంట్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని కోర్టుకు సంగీత తెలిపారు. తాను లండన్‌కు చెందిన వ్యక్తిని కావడంతో మరెక్కడా ఉండేందుకు అనుమతి లేదన్నారు. తనకు విజయ్ ఇంట్లో ఉండే హక్కు ఉందని కోర్టుకు వివరించారు. విడాకుల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ నీలాంగరై ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
సంగీత ఇటీవల 28 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఉద్వాసన పలుకుతూ వివిధ కారణాల రీత్యా విడాకులు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని, అది తనకు తన పిల్లలకు అవమానంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్ 20న ఈ కేసు విచారణకు రానుంది. యూకేకు చెందిన సంగీత లండన్‌లో చదువుకున్నారు. 1999 ఆగస్టు 25న విజయ్‌ను వివాహమాడారు. వీరికి సంజయ్ అనే కుమారుడు, దివ్వ అనే కుమార్తె ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌లో ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం