హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. మంత్రికి తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:21 PM
మహారాష్ట్ర బీజేపీ నేత, పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండేకు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. మంగళవారం నాడు ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది.
ముంబై: మహారాష్ట్ర బీజేపీ నేత, పర్యావరణ శాఖ మంత్రి పంకజ ముండే (Pankaja Munde)కు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. మంగళవారం నాడు ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్‌ను నిలిపివేశారు. దీంతో మంత్రితోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం శంభాజీ నగర్ నుంచి లాతూరుకు మంత్రి పంకజ ముండే హెలికాప్టర్‌లో బయలుదేరారు. అయితే టేకాఫ్ దశలోనే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. దీంతో లాతూర్ పర్యటనను మంత్రి వాయిదా వేసుకున్నారు. ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో తాజా ఘటన మరోసారి రాజకీయ నేతలను ఉలిక్కిపడేలా చేసిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ