Share News

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:34 PM

నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌‌పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలను కేంద్ర వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్
Rahul Gandhi

న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌‌పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పలు ప్రశ్నలు గుప్పించారు. ఈ డీల్ వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్‌ కుదుర్చుకున్నారని, దేశాన్ని అమ్మకానికి పెట్టారని, తమ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనని మోదీ భయపడుతున్నారని పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.


'ప్రధాని మోదీ వణుకుతున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోదీ సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. నరేంద్ర మోదీ ఇమేజ్ దెబ్బతినవచ్చు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేతను మాట్లాడనీయకపోవడం ఇదే మొదటిసారి. ట్రేడ్ డీల్‌ విషయంలో రాజీపడ్డారు. దేశాన్ని అమ్మేశారు. ఇంతవరకూ మలచుకుంటూ వస్తున్న తన ఇమేజ్‌ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోదీ భయపడుతున్నారు' అని రాహుల్ విమర్శించారు.


భయానికి కారణాలివే..

మోదీ భయపడడానికి కారణాలను రాహుల్ వివరిస్తూ.. 'అదానీపై అమెరికాలో కేసు ఉంది. నిజానికి ఇది మోదీపై కేసు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చాలా విషయాలున్నాయి. దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదు. ఆ ఒత్తిడి కూడా ఉంది. ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవే. దేశం దీనిని అర్థం చేసుకోవాలి' అని అన్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

అమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై సుమోటో ప్రకటన‌కు కేంద్రం హామీ

Updated Date - Feb 03 , 2026 | 04:37 PM