బడ్జెట్ సమావేశాలు.. 8మంది ఎంపీల సస్పెన్షన్..
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:22 PM
బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8 మంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై వేటు పడింది. స్పీకర్ వైపునకు పేపర్లు విసిరినందుకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఢిల్లీ: లోక్‌సభలో తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 8మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ ఓం బిర్లాపై వైపుగా కాగితాలను విసిరినందుకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు మాణిక్కం ఠాగూర్ (తమిళనాడు ఎంపీ), గుర్జీత్ సింగ్ ఔజ్లా (పంజాబ్), అమరీందర్ సింగ్ రాజా(పంజాబ్), కిరణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), హిబీ ఈడెన్ (కేరళ), డీన్ కురియకోస్ (కేరళ), ప్రశాంత్ పడోలే (మహారాష్ట్ర)తోపాటు సీపీఎమ్‌కు చెందిన ఎస్.వెంకటేశన్ (తమిళనాడు)ను మిగిలిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదంటూ లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేశారు.
స్పీకర్ ఓం బిర్లాపై కాగితాలు విసిరిన ఎంపీలపై చర్యలు కోరుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించడంతో సస్పెన్షన్ వేటు పడింది (Lok Sabha MPs Suspended). భారత్-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇవీ చదవండి:
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. మంత్రికి తప్పిన ప్రమాదం
అజిత్ పవార్ అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు.. ఏడుగురి అరెస్ట్