డీలిమిటేషన్‌పై చిదంబరం ఆసక్తికర ట్వీట్
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:04 AM
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి గతంలో తాను చేసిన ట్వీట్‌ను తాజాగా ఆయన ప్రస్తావించారు.
చెన్నై, ఏప్రిల్ 15: డీలిమిటేషన్‌పై గత వారం తాను వ్యక్తం చేసిన ఆందోళనలు ఇప్పుడు నిజమయ్యాయని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తెలిపారు. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలను 815కి పెంచే ప్రతిపాదన ఉందన్నారు. దీంతో తమిళనాడులో లోక్ సభ స్థానాలు 39 నుంచి 58కి పెరుగుతాయని కనిపిస్తున్నా.. అది ఒక అపోహ మాత్రమేనని చిదంబరం హెచ్చరించారు. ఈ డీలిమిటేషన్ తర్వాత తమిళనాడు స్థానాలు 46కు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో, ఉత్తరప్రదేశ్ పరిస్థితి భిన్నంగా ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. తొలుత 120కి పెరిగి, డీలిమిటేషన్ తర్వాత సుమారు 140 స్థానాలకు చేరుకునే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం లోక్‌సభలో 24.3% దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఈ డీలిమిటేషన్ మార్పుల తర్వాత 20.7 శాతానికి పడిపోతాయని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను ఖచ్చితంగా వ్యతిరేకించాలి అని పి. చిదంబరం స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా పి. చిదంబరం డీలిమిటేషన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జస్టిస్ స్వర్ణ కాంత్ శర్మ కేసులో కొత్త మలుపు
For More National News And Telugu News