Share News

కోట్ల ఆస్తులున్నా.. ఆటోలో షూటింగ్‌కు.. నానా పటేకర్ సింపుల్ లైఫ్‌స్టైల్

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:30 PM

5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన నానా పటేకర్ కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇన్ని ఆస్తులు ఉన్నా ఆయన సాధారణ జీవితాన్నే ఇష్టపడ్డారు.

కోట్ల ఆస్తులున్నా.. ఆటోలో షూటింగ్‌కు.. నానా పటేకర్ సింపుల్ లైఫ్‌స్టైల్
Nana Patekar

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త నానా పటేకర్ మృతితో భారతీయ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈరోజు (గురువారం) గుండెపోటు కారణంగా ఆయన మరణించడంతో సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోట్ల ఆస్తులున్నా సాదాసీదా జీవితం గడిపిన నానా పటేకర్‌ లేని లోటు తీరనిదంటూ సంతాపం తెలియజేస్తున్నారు.


5 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన నానా పటేకర్ కోట్ల ఆస్తులు సంపాదించారు. వాటి విలువ రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పూణే సమీపంలోని ఖడక్‌వాస్లాలో 25 ఎకరాల ఫామ్‌హౌస్ కూడా ఆయనకు ఉంది. ఇన్ని ఆస్తులు సంపాదించినా నానా పటేకర్ సాధారణ జీవితాన్నే ఇష్టపడ్డారు. అనవసర ఆడంబరాలు వద్దనుకున్నారు. అందుకే ముంబైలోని ఒక సాధారణ 1బీహెచ్‌కే ఫ్లాట్‌లోనే నివసించారు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లకు ఆటోలో కూడా వెళ్లారు. మరోవైపు కష్టాల్లో ఉన్నవారి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడేవారు కాదు. రైతుల బాధలు చూసి చలించిపోయిన నానా పటేకర్.. ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి వేలాది రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డారు.


కాగా నానా పటేకర్ (75) ఈరోజు ఉదయం 5:20 నిమిషాలకు గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయిందని వెల్లడించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

చనిపోయే ముందు స్నేహితుడికి మెసేజ్ చేసిన నానా పటేకర్.. అందులో ఏముందంటే..!

నా దహన సంస్కారాల్లో ఎండిన కట్టెలే వాడాలి.. నానా పటేకర్ చివరి కోరిక

Updated Date - Oct 08 , 2026 | 05:36 PM