చనిపోయే ముందు స్నేహితుడికి మెసేజ్ చేసిన నానా పటేకర్.. అందులో ఏముందంటే..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:25 PM
చనిపోవడానికి మూడు గంటల ముందు నానా పటేకర్ తన స్నేహితుడికి మెసేజ్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని అందులో తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) ఈరోజు (గురువారం) కన్నుమూశారు. అయితే చనిపోవడానికి మూడు గంటల ముందు ఆయన తన స్నేహితుడికి మెసేజ్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని అందులో తెలిపారు. ఈ మెసేజ్ తెల్లవారుజామున రెండున్నర గంటలకు పెట్టడంతో.. ఆ స్నేహితుడు స్పందించలేకపోయారు. దీంతో నానా పటేకర్ కాల్ చేసి, తన ఇంటికి రావాలని మిత్రుడిని కోరారు. ఉదయం 4 గంటల సమయంలో అక్కడికి స్నేహితుడు వెళ్లారు.
అప్పుడే నానా పటేకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను గోవాలోని మణిపాల్ ఆసుపత్రికి బంధువులు తీసుకువెళ్లారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన 5.20 నిమిషాలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పోస్ట్‌మార్టం నిమిత్తం పార్థివ దేహాన్ని గోవాలోని మెడికల్ కళాశాలకు తరలించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
ఈ వార్తలూ చదవండి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత..
రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు.. నానా పటేకర్ చివరి కామెంట్స్