Share News

అనంతపురం జిల్లాలో శ్రీ కాళికామాత ఆలయంలో చోరీ కలకలం

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:45 AM

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆలయాన్ని టార్గెట్‌ చేసిన దొంగలు భారీగా బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లాలో శ్రీ కాళికామాత ఆలయంలో చోరీ కలకలం
Guntakal Temple Theft

అనంతపురం, అక్టోబర్ 8: జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సత్యనారాయణపేటలో కొలువైన శ్రీ కాళికామాత ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి చొరబడి భారీగా నగలు అపహరించారు. ఆలయంలోని సుమారు 6 కిలోల వెండి ఆభరణాలతో పాటు 10 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం ఆలయానికి వచ్చిన నిర్వాహకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆలయంలోని పరిస్థితిని పరిశీలించారు. భారీగా ఆభరణాలు చోరీకి గురికావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


సమాచారం అందుకున్న కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ దొంగల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. చోరీకి పాల్పడిన నిందితులు ఎంతమంది.. వారు ఏ మార్గంలో ఆలయంలోకి ప్రవేశించారు, చోరీ అనంతరం ఎటువైపు వెళ్లారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి త్వరగా పట్టుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. చోరీకి గురైన బంగారు.. వెండి ఆభరణాలను రికవరీ చేసి తిరిగి అమ్మవారికి సమర్పించాలని వారు పోలీసులను విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News

Updated Date - Oct 08 , 2026 | 01:54 PM