నా దహన సంస్కారాల్లో ఎండిన కట్టెలే వాడాలి.. నానా పటేకర్ చివరి కోరిక
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:22 PM
ఎండిన కట్టెలతో మాత్రమే తన దహన సంస్కారాలు పూర్తి చేయాలని నానా పటేకర్ గతంలో కోరారు. ఈ కోరిక వెనుక కారణాన్ని కూడా ఆయన వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు, దర్శకుడు నానా పటేకర్ ఇవాళ (గురువారం) గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన తన మరణంపై గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన దహన సంస్కారాలు ఎలా చేయాలో నానా పటేకర్ వివరిస్తూ చెప్పిన మాటలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. ‘నా దహన సంస్కారాల కోసం 12 మణుగుల (అంటే 480 కిలోలు) కట్టెలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాను’అని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
12 మణుగుల కట్టెలను తాను ఎండబెట్టానని నానా పటేకర్ చెప్పారు. ఈ ఎండిన కట్టెలతో మాత్రమే తన దహన సంస్కారాలు పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కోరిక వెనుక కారణాన్ని కూడా వివరించారు. ‘దయచేసి ఎండిన కట్టెలతోనే నన్ను దహనం చేయండి. తడివాటితో మాత్రం వద్దు. ఎందుకంటే తడి కట్టెలు వాడితే వచ్చే పొగ వల్ల అక్కడున్న వారికి కన్నీళ్లు వస్తాయి. అది చూసి నేను వారు నాకోసం ఏడుస్తున్నారేమో అని భ్రమపడతాను. మరణ సమయంలో ఇలాంటి గందరగోళం ఎందుకు చెప్పండి’ అని చెప్పి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
2023 సెప్టెంబర్‌లో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను నానా పటేకర్ వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో మరణంపై తనకున్న తాత్విక అవగాహనను ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. భౌతిక ఆస్తులు, సంపదలు అశాశ్వతమని, మరణం అనేది కఠినమైన వాస్తవమని తెలిపారు. నానా పటేకర్ మరణం తరువాత ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను దర్శకుడు ఆర్జీవీ ఎక్స్‌లో షేర్ చేశారు కూడా.
ఈ వార్తలూ చదవండి
చనిపోయే ముందు స్నేహితుడికి మెసేజ్ చేసిన నానా పటేకర్.. అందులో ఏముందంటే..!
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత..