2007లోనే సైఫ్.. ఫార్ములా-1 వరల్డ్ చాంపియన్: కరీనా
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:45 PM
బాలీవుడ్ నటుడు, తన భర్త సైఫ్ అలీ ఖాన్ 19 ఏళ్ల కిందే ఫార్ములా 1 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచాడని కరీనా కపూర్ పేర్కొన్నారు. అయితే, అది 2007 సంవత్సరంలో విడుదలైన ‘త ర రం పం’ సినిమాలో అని సరదాగా వ్యాఖ్యానించారు. కరీనా శుక్రవారం సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్‌కు హాజరయ్యారు. రేసు ముగిసిన తర్వాత ఎఫ్1 డ్రైవర్ ల్యాండో నోరిస్‌ను ఆమె ఇంటర్వ్యూ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, తన భర్త సైఫ్ అలీ ఖాన్ 19 ఏళ్ల కిందే ఫార్ములా 1 వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచాడని కరీనా కపూర్ పేర్కొన్నారు. అయితే, అది 2007 సంవత్సరంలో విడుదలైన ‘త ర రం పం’ సినిమాలో అని సరదాగా వ్యాఖ్యానించారు. కరీనా శుక్రవారం సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్‌కు హాజరైంది. రేసు ముగిసిన తర్వాత ఎఫ్1 డ్రైవర్ ల్యాండో నోరిస్‌ను ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను గూగుల్ ఇండియా షేర్ చేసింది. కరీనా, నోరిస్ ఆ ఇంటర్వ్యూలో సరదాగా సంభాషించుకున్నారు. ఈ సందర్భంగా ఫార్ములా 1పైనా మాట్లాడుకున్నారు. వారు మాట్లాడుకుంటుండగా మధ్యలో ‘త ర రం పం’ సినిమా ప్రస్తావన వచ్చింది. ‘‘2007లో త ర రం పం మూవీ విడుదలైంది. ఆ సినిమాలో ఫార్ములా 1 లాంటి రేసింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ రేసులో నా భర్త సైఫ్ వరల్డ్ చాంపియన్‌గా నిలుస్తాడు. అంటే 19 ఏళ్ల కిందటే సైఫ్ ఎఫ్ 1 వరల్డ్ చాంపియన్ బహుమతిని అందుకున్నాడు’’ అని కరీనా పేర్కొన్నారు. దీనికి నోరిస్ స్పందిస్తూ.. వాస్తవానికి సైఫ్, తాను ఒక్కటే అని బదులిచ్చాడు.
అలాగే తన రేసింగ్ కరియర్, ఫార్ములా 1లో మెక్ లారెన్ ఘనతల గురించి నోరిస్‌ను కరీనా పలు ప్రశ్నలు అడిగారు. దానితోపాటు నోరిస్‌కు కరీనా ఇండియన్ మసాలా చాయ్ రూచి చూపారు. మసాలా చాయ్ ఎలా ఉందని అడిగారు. కాగా.. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్‌కు కరీనా హాజరైన దృశ్యాన్ని మెక్ లారెన్ ఎఫ్ 1 తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో షేర్ చేసింది. ‘‘మెక్ లారెన్ రేసింగ్ చూడడానికి వచ్చిన స్పెషల్ గెస్ట్ కరీనా కపూర్ ఖాన్’’ అంటూ పోస్టు చేసింది. ఆ పిక్‌లో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్‌ను కరీనా చూస్తున్న దృశ్యం ఉంది. అలాగే ఆ రేసింగ్‌ను తాను చూస్తున్న ఒక పిక్చర్‌ను కరీనా కూడా తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఇవీ చదవండి:
‘ఢిల్లీని స్తంభింపజేయడం సమంజసమేనా?’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేరళ మాజీ సీఎం విజయన్‌కు షాక్.. ఎఫ్‌ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం