జైష్ సంస్థతో సంబంధాలు.. ముంబైలో ఒకరి అరెస్ట్
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:22 PM
పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ -ఎ- మొహమ్మద్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణల కారణంగా ముంబైలో మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ (33)ను మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అరెస్ట్ చేసింది. నగరంలోని మహిమ్ ప్రాంతంలో అతడిని శనివారం అదుపులోకి తీసుకుంది.
ముంబై, అక్టోబర్ 24: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ -ఎ- మొహమ్మద్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణల కారణంగా ముంబైలో మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ (33)ను మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అరెస్ట్ చేసింది. నగరంలోని మహిమ్ ప్రాంతంలో అతడిని శనివారం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని విచారిస్తోంది. పాక్ ఐఎస్ఐకు చెందిన వారితో ఉన్న సంబంధాలపై అతడిని విచారిస్తుంది. అతడి సెల్ ఫోన్‌ను పరిశీలించగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జైష్-ఎ- మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు సంబంధించిన రెచ్చగొట్టే ఆడియో క్లిప్‌లతోపాటు సోషల్ మీడియా పోస్టులను వారు గుర్తించారు. దీంతో ఏటీఎస్ కలాచౌక్ యూనిట్‌లో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా కార్యకలాపాలతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా సర్మాద్ అక్తర్ కేసు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మరో వైపు గతంలో గుజరాత్‌లో జైష్ -ఎ- మొహమ్మద్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన ఎనిమిది మందిని ఉగ్రవాద వ్యతిరేక దళం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో వారంతా ఈ ఆ సంస్థ కోసం చురుకైన పాత్ర పోషించడంతోపాటు సభ్యులను నియమించేందుకు నెట్ వర్క్‌ను చేపట్టారు. ఆ రాష్ట్రంలో భావజాలాన్ని వారి ద్వారా వ్యాప్తి చేయడానికి వీరంతా పని చేస్తున్నారని ఉగ్రవాద వ్యతిరేక దళం వెల్లడించిన విషయం విదితమే. అందుకోసం దారుల్ ఇస్లాం గుజరాత్ జైష్ ఎ మొహమ్మద్ అనే సంస్థను వారు స్థాపించారని ఏటీఎస్ వివరించింది. ఈ ఎనిమిది మందిలో ఏడుగురు గుజరాతీలు కాగా.. ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారని ఏటీఎస్ స్పష్టం చేసిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
మాదాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్..
ఏసీబీ అధికారుల దాడులు.. హెడ్ కానిస్టేబుల్ ఆస్తులు రూ.66 కోట్లు
For More National News And Telugu News