Share News

క్షణికావేశంతో సోదరిని 40 సార్లు పొడిచి చంపిన యూట్యూబర్..

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:48 PM

ఉత్తర ప్రదేశ్‌‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుద్ధి విహార్ కాలనీకి చెందిన యూట్యూబర్ హార్దిక్ తన సోదరి హిమ్షిఖాను కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే..

క్షణికావేశంతో సోదరిని 40 సార్లు పొడిచి చంపిన యూట్యూబర్..
Moradabad Crime News

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్‌(Uttar Pradesh)లోని మొరాదాబాద్‌లో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుద్ధి విహార్ కాలనీకి చెందిన యూట్యూబర్(YouTuber) హార్దిక్ తన సోదరి హిమ్షిఖాను కత్తితో పొడిచి చంపాడు. గురుగ్రామ్ నుంచి హోలీ జరుపుకోవడానికి ఇంటికి వచ్చారు. హిమ్షిఖా-హార్దిక్ మధ్య చిన్న గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోతూ వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకొని హిమ్షిఖాను 40 సార్లు పొడిచి చంపాడు. తన సోదరిని చంపిన తర్వాత, హార్దిక్ తన తల్లి ఆఫీస్‌కి వెళ్ళాడు. ‘అమ్మా, ఇంటికి రా! నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను’ చెప్పి తల్లిని ఇంటికి తీసుకువచ్చాడు.

Uttar pradesh.jpg


హార్దిక్ తల్లి నీలిమా ఇంటికి వచ్చి తలుపు తెరిచి చూడగా హిమ్షిఖాను చూసి షాక్ తిన్నది. అదే సమయంలో హార్దిక్ తన తల్లిని ఆరు సార్లు కత్తితో పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో చూసి కత్తి అక్కడే వదిలి హార్దిక్ పారిపోయాడు. గాయపడ్డ నీలిమను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రాణాలతో బయటపడినా, హిమ్షిఖా మాత్రం మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు హార్దిక్‌ని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.


అసలేం జరిగిందంటే..

హార్దిక్ బీటెక్. పూర్తి చేసిన తర్వాత గూగుల్‌లో పనిచేశాడు. ఒక ఏడాది క్రితం తన ఉద్యోగాన్ని వదిలివేసి యూట్యూబర్‌గా మారాడు. ఉద్యోగం చేసే సమయంలో పూణేకు చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడు నెలల క్రితం సదరు యువతి బ్రేకప్ చెప్పడంతో, హార్దిక్ మానసికంగా కుంగిపోయాడు. తన ప్రేమ విఫలం కావడానికి తల్లీ, చెల్లెలు కారణం అని అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపైనే హోలీ రోజు హిమ్షిఖాతో గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయి కత్తితో పొడిచినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నాడు హర్దిక్. హిమ్షిఖా ఒక ఐటీ కంపెనీలు జాబ్ చేస్తూ ఎంబీఏ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read:

ప్రీమియం బారెడు క్లెయిమ్‌ మూరెడు!

నేనక్కడే ఉన్నా.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు..!

For More Latest News

Updated Date - Mar 09 , 2026 | 01:51 PM