Share News

తమిళనాడులో మళ్లీ స్టాలిన్‌కే పట్టం... ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 09:44 PM

తమిళనాడు ఓటర్లు మళ్లీ స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 122 నుంచి 145 సీట్లు దక్కుంచుకోనున్నట్టు కనీసం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి.

తమిళనాడులో మళ్లీ స్టాలిన్‌కే పట్టం... ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు
MK Stalin

న్యూఢిల్లీ: తమిళనాడు ఓటర్లు మళ్లీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టనున్నట్టు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 122 నుంచి 145 సీట్లు దక్కుంచుకోనున్నట్టు కనీసం మూడు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ టీవీకే పార్టీ 98-120 సీట్లు గెలుచుకోనున్నట్టు ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా జోస్యం చెప్పింది. ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం అన్నాడీఎంకే కూటమి 128 నుంచి 147 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.


చాణక్య స్ట్రాటజీస్‌

డీఎంకేకు 145-160 సీట్లు వస్తాయని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. అన్నాడీఎంకే 50-65 సీట్లు, TVK 13-18 సీట్లు, ఇతరులకు 5-8 సీట్లు వస్తాయని తెలిపింది.

పీపుల్స్ పల్స్

డీఎంకే, భాగస్వామ్య పార్టీలు 125-145 సీట్లు గెలుచుకోనున్నట్టు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమికి 65-80 సీట్లు దక్కనున్నాయి.

పీపుల్స్ ఇన్‌సైట్

పీపుల్స్ ఇన్‌సైట్ అంచా ప్రకారం డీఎంకే కూటమి 120-140 సీట్లు గెలుచుకుంటుంది. అన్నాడీఎంకే కూటమికి 60-70 సీట్లు దక్కుతాయి.

ప్రజా పోల్

డీఎంకే కూటమికి 148-168 సీట్లు వస్తాయని ప్రజా పోల్ అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 61-81 సీట్లు గెలుచుకుంటుంది. టీవీకే 1-9 సీట్లు గెలుచుకుంటుంది.

పీ-మార్క్

పీ-మార్క్ సర్వే డీఎంకేకు 125-145 సీట్లు వస్తాయని పేర్కొంది. అన్నాడీఎఁకే 87-100 సీట్లు, విజయ్ టీవీకే 10-12 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

మ్యాట్రిజ్

మ్యాట్రిజ్ సర్వే డీఎంకే 122-132 సీట్లు, అన్నాడీఎంకే 87-100 సీట్లు, విజయ్ టీవీకే 10-12 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

కామాఖ్య అనలటిక్స్

కామాఖ్య అనలటిక్స్ సంస్థ డీఎంకే కూటిమికి 78-95 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 68-84 సీట్లు, టీవీకే 67-81 సీట్లు గెలుచుకుంటాయని తెలిపింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమైతే ప్రభుత్వ ఏర్పాటుకే టీవీకే పార్టీ పాత్ర కీలకంగా మారుతుంది.

జేవీసీ

జేవీసీ సంస్థ అన్నాడీఎంకే కూటమికి 128-147 సీట్లు వస్తాయని అంచనావేసింది. డీఎంకే కూటమి 75-95 సీట్లు గెలుచుకుంటుందని, విజయ్ టీవీకే 8-15 సీట్లు దక్కించుకుంటుందని తెలిపింది.

ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా

డీఎంకేకు 92-110 సీట్లు వస్తాయని ఎన్డీటీవీ-యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. అన్నాడీఎంకే 22-23 సీట్లకు పరిమితమవుతుంది. టీవీకే 98-120 సీట్లు దక్కించుకుంటుంది.


ఇవి కూడా చదవండి..

మమత కోటలో బీజేపీ పాగా.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జోస్యం

అస్సాంలో కమలం హ్యాట్రిక్... ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవం

Updated Date - Apr 29 , 2026 | 09:51 PM