కేరళం ఎగ్జిట్ పోల్స్ 2026: యుడిఎఫ్ (UDF) ముందంజ.. అధికార మార్పు దిశగా 'కేరళం'?
ABN , Publish Date - Apr 29 , 2026 | 07:07 PM
కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది.
కేరళం, ఏప్రిల్ 29: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వివిధ సంస్థలు కేరళం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరిస్తున్నాయి. Axis My India విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఐదేళ్లకోసారి అధికారం మారే సాంప్రదాయాన్ని గత ఎన్నికల్లో ఎల్డిఎఫ్ (LDF) బ్రేక్ చేసినప్పటికీ, ఈసారి అంచనాలు మళ్లీ పాత పంథానే సూచిస్తున్నాయి.
తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది. UDF (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) 44 శాతం (సానుకూలత) కనబరుస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని LDF (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) 39 శాతం అంటే, గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో 6 శాతం వరకు (తగ్గుదల) కనిపిస్తోంది. ఇక, బీజేపీ నాయకత్వంలోని NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) 14 శాతం (స్వల్ప పెరుగుదల) కనబరిచింది. ఇతరులు (Others) 3 శాతం (స్థిరం)గా ఉంది.
యాక్సెస్ మై ఇండియా Axis My India ఎగ్జిట్ పోల్ గణాంకాలను విశ్లేషిస్తే, కేరళంలో ఈసారి అధికారం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుడిఎఫ్ (UDF) కూటమి 44 శాతం ఓట్ల షేర్‌తో అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుత అధికార కూటమి ఎల్డిఎఫ్ (LDF) 39 శాతం వద్ద నిలిచింది. ఈ 5 శాతం ఓట్ల వ్యత్యాసం సాధారణంగా అసెంబ్లీ స్థానాల పరంగా పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది.

కేరళం ఎగ్జిట్ పోల్స్ 2026: అధికారం దిశగా యుడిఎఫ్ (UDF).. స్వల్ప మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం!
కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో వెలువడుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రంలో అధికార మార్పును సూచిస్తున్నాయి. News18 విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన ఆధిక్యతను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. కేరళం అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71. న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇలా ఉన్నాయి:
UDF (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) 70 - 80
LDF (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) 58 - 68
NDA (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) 0 - 4
OTH (ఇతరులు) 00
