Share News

యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:53 PM

గోవులను అక్రమంగా తరలించి గోవధకు పాల్పడే స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు.

యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
ow smuggling Meerut

ఉత్తర్‌ప్రదేశ్, ఆగస్టు 24: ఉత్తర్‌‌ప్రదేశ్‌లో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న(ఆదివారం) యూపీలోని మీరట్‌లో కొందరు గోవులను అక్రమంగా తరలించి, గోవధకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారమందింది. దీంతో పోలీసులు గోవధ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగా అక్కడ ఓ గోవు చెట్టుకు కట్టేసి ఉంది. పోలీసులు రావడాన్ని గమనించిన తస్లీమ్‌, భూరా అనే స్మగ్లర్లు వెంటనే కాల్పులు జరపడం మొదలుపెట్టారు.


ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు స్మగ్లర్లూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా మరో స్మగ్లర్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటిదాకా తస్లీమ్‌పై 15 కేసులు, భూరాపై 10 కేసులు ఉన్నాయని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

హోం మంత్రి అనితపై కూలిన డ్రోన్.. చేతికి స్వల్ప గాయం

కాస్త ఆలస్యమైనా నదుల అనుసంధానం పక్కా: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

Read Latest National News And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 01:56 PM