Share News

విరిగిపడిన భారీ కొండచరియలు.. రుద్రప్రయాగ్‌లో 80 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 07:28 PM

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. కేదార్ లోయలోని టిమ్లీ-బడ్మా రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

విరిగిపడిన భారీ కొండచరియలు.. రుద్రప్రయాగ్‌లో 80 గ్రామాలకు నిలిచిన రాకపోకలు..
Uttarakhand Landslide

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసానికి దారితీశాయి. కేదార్ లోయలోని టిమ్లీ-బడ్మా రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో భారీ రాళ్లు, మట్టి రహదారిపై పేరుకుపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి (Rudraprayag Landslide).


భారీ వర్షాల కారణంగా అలకనంద, మందాకిని నదుల నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరువయ్యాయి. దీంతో నదీ తీర ప్రాంతాలకు వెళ్లొద్దని స్థానిక అధికార యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది. మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని సూచించింది (80 Villages Cut Off).


కాగా, టిమ్లీ-బడ్మా రహదారిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు (Uttarakhand Heavy Rain). రహదారి నుంచి శిథిలాలను తొలగించి, తిరిగి రాకపోకలను పునరుద్ధరించేందుకు యంత్రాలు, విపత్తు నిర్వహణ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. అయితే వర్షాలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.


ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..


హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Updated Date - Aug 06 , 2026 | 07:28 PM