హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:00 PM
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్‌ను తెరవడం గురించి ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. హోర్ముజ్‌ను తెరవడం గురించి ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా మారాయి. అలాగే అమెరికా-ఇరాన్ మధ్య కూడా శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలు పెరగడంతో పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించారు. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గాయి (Crude Oil Prices).
ఈ చర్చలు విజయవంతమైతే ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా మళ్లీ సాధారణ స్థాయిలో రవాణా ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మార్కెట్లో పూర్తిస్థాయి నమ్మకం ఇంకా ఏర్పడలేదు. ఒప్పందం ఖరారు కాకపోవడం, ఎర్ర సముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా సమస్యలు, హౌతి దాడుల ముప్పు వంటి అంశాలు ఇంకా చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ( Iran Oman Talks).
చర్చలు ఫలించి హోర్ముజ్ తెరుచుకుంటే భారత్‌కు చాలా ప్రయోజనం కలుగుతుంది (US Iran Peace Deal). భారత్ తన ముడి చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
చెత్తకుప్పలో కాలిన మృతదేహం.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు