జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మావోయిస్టుల మృతి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:55 AM
దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం విధించిన గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
రాంచీ, జనవరి 22: దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం విధించిన గడువు మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్ సింగ్‌భూమ్ జిల్లాలోని కిరిభూమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఒడిశా, జార్ఖండ్‌లతో పాటు ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే కూంబింగ్‌ను తీవ్రతరం చేయడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం దాదాపుగా తగ్గిపోయింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతాన్ని ఇప్పటికే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే.. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీలో ఉన్న పలువురు అగ్రనేతలు వయో భారంతో ఉన్నారు. వారే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం సహా సరిహద్దు రాష్ట్రాల్లో కూంబింగ్‌ను తీవ్రతరం చేశాయి భద్రతా బలగాలు. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం కేంద్రం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్‌ను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీంతో దేశంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో కూంబింగ్ తీవ్రతరం చేసింది. అందులో భాగంగా ఇటీవల.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో వందాలది మంది మావోయిస్టులు మరణించారు. మరికొందరు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వారిలో అగ్రనేతలు సైతం ఉండటం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే.?
వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?
For More National News And Telugu News