Share News

ఐస్‌క్రీం తింటూ గిన్నిస్‌ రికార్డు

ABN , Publish Date - Jan 22 , 2026 | 04:11 AM

ఒకే సమయంలో 4,008 మంది చిన్నారులు ఐస్‌క్రీమ్‌ తిని గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌....

ఐస్‌క్రీం తింటూ గిన్నిస్‌ రికార్డు

  • ఒకే సమయంలో ఆరగించిన 4వేలకుపైగా చిన్నారులు

ఒకే సమయంలో 4,008 మంది చిన్నారులు ఐస్‌క్రీమ్‌ తిని గిన్నిస్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌కు చెందిన ‘అరు ణ్‌ ఐస్‌క్రీమ్‌’ ఆధ్వర్యంలో బుధవారం చెన్నైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిచారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను పలు వరుసల్లో నిలబెట్టి, వారికి బటర్‌ స్కాచ్‌, చాకొలెట్‌ ఫ్లేవర్‌ జాలి ట్రైన్‌, పాలతో కూడిన ఐస్‌క్రీమ్‌లను అందించారు. వారంతా ఒకే సమయంలో ఒక నిమిషంపాటు ఐస్‌క్రీమ్‌ను సేవించారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిన్‌ ప్రతినిధులు రిచర్డ్‌ విలియం స్టెన్నింగ్‌(యూకే), మిలింద్‌ వెర్లేకర్‌(పుణే) అధికారికంగా గుర్తించారు. హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ వైస్‌ చైర్మన్‌ సి.సత్యన్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు.

Updated Date - Jan 22 , 2026 | 04:11 AM