Share News

ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు కీలక నేత మృతి

ABN , Publish Date - Feb 05 , 2026 | 10:23 AM

ఛత్తీస్‌గఢ్‌లోని పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత ధరమ్‌సింగ్ మృతి చెందినట్లు తెలుస్తోంది.

 ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు కీలక నేత మృతి
Chhattisgarh Encounter

ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పెద్దగెల్లూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత ధరమ్‌సింగ్ మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.


నిఘా సమాచారం ఆధారంగా పెద్దగెల్లూరు అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలియడంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు.. కాల్పులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ధరమ్‌సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్‌ పూర్తి నివేదిక

Read Latest Telangana News and National News

Updated Date - Feb 05 , 2026 | 10:38 AM