Share News

పది రూపాయలతో మోదీ డ్రామా.. మమత విసుర్లు

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:14 PM

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చోట ఆగి 'ఝుల్‌మురి' కొనుక్కు తినడాన్ని ఒక 'డ్రామా'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొట్టివేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు.

పది రూపాయలతో మోదీ డ్రామా.. మమత విసుర్లు
Mamata Banerjee and PM Modi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చోట ఆగి 'ఝుల్‌మురి' కొనుక్కు తినడాన్ని ఒక 'డ్రామా'గా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కొట్టివేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు. ఇది పక్కాగా వేసిన ప్లాన్ అని అన్నారు.


'ఇదంతా ఒక నాటకం. షెడ్యూల్‌లో లేకుండా ప్రధాని అక్కడ అనూహ్యంగా ఆగి ఉంటే కెమెరా అక్కడకు ఎలా వచ్చింది? ఇదంతా ముందస్తు వ్యూహం ప్రకారం జరిగిందే. ప్రధాని తన జేబులో 10 రూపాయల నోటు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇది నమ్మశక్యంగా ఉందా?' అని ప్రశ్నించారు. బీర్భూమ్ జిల్లా మురారయి నియోజకవర్గంలో మమతాబెనర్జీ సోమవారంనాడు ఎన్నికల ప్రచారం సాగించారు.


పదిరూపాయలతో మరమరాలు కొనుక్కొని..

ప్రధానమంత్రి మోదీ ఆదివారంనాడు పశ్చిమబెంగాల్‌లో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యలో జార్‌గ్రామ్ పట్టంలో రోడ్డు పక్కనున్న దుకాణం వద్ద ఆగారు. పది రూపాయలు ఇచ్చి ఝుల్‌మురి కొనుక్కొన్నారు. అక్కడకు చేరిన జనంతో ముచ్చటిస్తూ, వారికి కూడా ఝుల్‌మరి పంచుతూ మాట్లాడారు. ఆ క్షణాలను ప్రధాని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. నాలుగు ర్యాలీల మధ్యలో రుచికరమైన మరమరాలు తిన్నానని అందులో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అఫిడవిట్లలో రూ.100 కోట్ల తేడా.. టీవీకే చీఫ్ విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

15 ఏళ్లు తక్కువేం కాదు, ఈసారి బెంగాల్‌లో బీజేపీ పాగా... రాజ్‌నాథ్ సింగ్

Updated Date - Apr 20 , 2026 | 07:46 PM