500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్ కోరండి.. మమతా బెనర్జీ దిశానిర్దేశం
ABN , Publish Date - May 03 , 2026 | 03:06 PM
దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్ కోరాలని వారికి సూచించారు.
కోల్‌కతా: దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండటంతో ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ 500 నుంచి 700 ఓట్ల ఆధిక్యంలో ఉంటే ఆయా బూత్‌లలో కచ్చితంగా రీపోలింగ్ కోరాలని వారికి సూచించారు. ఆదివారంనాడు రాత్రంతా కౌంటింగ్ సెంటర్ల వద్దే ఉండాలని, అందువల్ల సోమవారం ఉదయమే కౌంటింగ్ సెంటర్లకు చేరే వీలుంటుందని చెప్పారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో పార్టీ నేతలు, కౌంటింగ్ ఏజెంట్లతో మమతాబెనర్జీ వర్చువల్ మీట్ జరిపారు.
కౌంటింగ్ సమయంలో సమన్వయం, నిఘా అనేది చాలా ముఖ్యమని, కౌంటింగ్ సెంటర్లకు ఉదయమే కార్యకర్తలు చేరుకుని కలిసికట్టుగా పనిచేయాలని మమతా బెనర్జీ సూచించారు. బీజేపీకి ఎక్కడైనా 500 నుంచి 700, 1,000 ఓట్ల వరకూ మార్జిన్ వస్తే తక్షణమే రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయాలని సూచించారు. టీఎంసీ 200కు పైగా సీట్లలో గెలుస్తుందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కౌంటింగ్ సమయంలో ఏమాత్రం అలసత్యం చూపించవద్దన్నారు. మే 4న తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసేంత వరరూ పార్టీ ఏజెంట్లెవరూ కౌంటింగ్ సెంటర్లను విడిచిపెట్టవద్దని కోరారు.
గ్రామీణ, సుదూర ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లున్న నియోజకవర్గాలకు ఆదివారంనాడే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు చేరుకోవాలని, ఎలాంటి జాప్యానికి తావులేకుండా సమీపంలోని హోటళ్లు, లాడ్జీలలో బస చేయాలని మమతా బెనర్జీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. విజయ్ ముందు జాగ్రత్త..
ఫాల్తాలో రీపోలింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..