తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. విజయ్ ముందు జాగ్రత్త..
ABN , Publish Date - May 03 , 2026 | 12:58 PM
తమిళనాడులో ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హంగ్ వస్తుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి.
తమిళనాడులో ఎన్నికల ఫలితాలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. హంగ్ వస్తుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) కీలక వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టీవీకే అభ్యర్థులు చేజారకుండా విజయ్ అప్రమత్తమైనట్టు వార్తలు వస్తున్నాయి (Vijay TVK MLAs).
ఇప్పటికే విజయ్ మహాబలిపురంలో ఓ రిసార్ట్ బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అభ్యర్థులు నేరుగా ఆ రిసార్ట్‌కు రావాలని విజయ్ ఆదేశించినట్టు సమాచారం. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాలను ప్రారంభించాయి (Tamil Nadu hung assembly 2026).
కాగా, తాజా ఎన్నికల్లో టీవీకే 98-120 సీట్లు గెలుచుకుంటుందని 'యాక్సిస్ మై ఇండియా' అంచనా వేసింది (Tamil Nadu elections). అలాగే, డీఎంకే నేతృత్వంలోని కూటమి 92-100 సీట్లు, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఐదు పార్టీల కూటమి 22-32 సీట్లు దక్కించుకుంటాయని జోస్యం చెప్పింది. ఇక, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్.. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డాయి. టీవీకే పది సీట్లు కూడా సాధించలేదని అంచనా వేశాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
డచ్ యువరాణుల హత్యలకు కుట్ర.. బయటపడిన నాజీ తరహా ప్లాన్..