Share News

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

ABN , Publish Date - May 25 , 2026 | 10:38 AM

మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.

నదీ లోయలోకి దూసుకెళ్లిన స్కార్పియో వాహనం.. 8 మంది దుర్మరణం

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయగఢ్‌లోని అంబెనాలి ఘాట్ సమీపంలో నదీ లోయలోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా, మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.


మహాబలేశ్వర్, పొలాద్‌పూర్ మధ్య ఉన్న అంబెనాలి ఘాట్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులు మృతిచెందినట్లు సమాచారం. నది సుమారు 500 నుంచి 700 అడుగుల లోతు వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. స్కార్పియో ఎస్‌యూవీ సతారా జిల్లాలోని ఆస్‌గావ్‌కు ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బాధితులంతా సతారాకు చెందినవారేనని తెలుస్తోంది. వారు దాపోలి నుంచి సతారాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

మృతుల వివరాలు:

(1) అన్ష్ సమీర్ చవాన్ (19)

(2) రితేశ్ రాజేంద్ర లోఖండే (22)

(3) సుహాస్ జితేంద్ర లోఖండే (20)

(4) ఉత్కర్ష్ ఆనంద్ షింగ్టే (21)

(5) నిఖిల్ అభిమన్యు షింగ్టే (25)

(6) మహేశ్ అనిల్ పవార్ (25)

(7) ఆదిత్య అశోక్ సలుంఖే (21)

(8) రాజేశ్ అశోక్ కట్కర్ (35)


ఇవీ చదవండి:

నటి ట్విష శర్మ కేసు.. రెండు వారాల తర్వాత అంత్యక్రియలు పూర్తి..

భారత్ ఏది కోరుకుంటే అది దక్కుతుంది: డొనాల్డ్ ట్రంప్

Updated Date - May 25 , 2026 | 10:46 AM