Share News

భారత్ ఏది కోరుకుంటే అది దక్కుతుంది: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - May 25 , 2026 | 08:41 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు తాను పెద్ద అభిమానినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోనుంది.

భారత్ ఏది కోరుకుంటే అది దక్కుతుంది: డొనాల్డ్ ట్రంప్
Trump Modi friendship

భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు తాను పెద్ద అభిమానినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోనుంది. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆధ్వర్యంలో ఆ దేశ ఎంబసీ ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించింది (Trump Modi friendship).


ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ఫోన్ కాల్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. 'భారత ప్రధాని మోదీ చాలా గ్రేట్. నాకు ఆయన మంచి మిత్రుడు. ఇంతకుముందు కంటే భారత్ మాకు మరింత దగ్గరైంది. వారు మమ్మల్ని వంద శాతం నమ్మవచ్చు. ప్రస్తుతం అమెరికాకు రికార్డు స్థాయి ఆర్థిక వ్యవస్థ ఉంది. ఏ సహాయం కావాలన్నా భారత్ మాకే ఫోన్ చేస్తుంది. భారత్ ఏది కోరుకుంటే అది దక్కుతుంది' అని ట్రంప్ పేర్కొన్నారు (Delhi live event).


ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోను కూడా ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు (Rubio India visit). అమెరికా చరిత్రలోనే రుబియో గొప్ప విదేశాంగ మంత్రి అని ప్రశంసించారు. కాగా, అమెరికా-భారత్‌లు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు దగ్గర్లో ఉన్నాయని రుబియో పేర్కొన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు మేలు చేస్తుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Updated Date - May 25 , 2026 | 08:41 AM