మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. నెస్లే ఏమందంటే.?
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:50 PM
ముంబై కల్యాణ్‌లో మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు, లార్వాలు కనిపించాయంటూ కస్టమర్ ఆరోపించారు. ఈ ఘటనపై నెస్లే ఇండియా స్పందించింది.
ఇంటర్నెట్ డెస్క్: మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు, లార్వాలు కనిపించాయంటూ ముంబైలో ఇటీవల ఓ కస్టమర్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఆయన.. మ్యాగీ చేస్కునేటప్పుడు పురుగులు కనిపించాయని చెప్పారు. ఆయన ఉపయోగించిన ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ 2027 వరకూ ఉన్నట్టు తెలుస్తోంది.
దీంతో ఈ ఘటనపై ఆహార భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత మ్యాగీ ప్యాకెట్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) అధికారులు పరిశీలించి, నమూనాలను టెస్టింగ్ ల్యా్బ్‌కు పంపాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెస్లే ఇండియా స్పందించింది. ఈ విషయం మీడియా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఆ కస్టమర్ గానీ, సంబంధిత అధికారులెవరూ ఇప్పటివరకు తమను సంప్రదించలేదని చెప్పింది. ఈ క్రమంలో ఫిర్యాదులోని ఆరోపణల వాస్తవికతపై వ్యాఖ్యానించలేమని స్పష్టం చేసింది.
కాగా.. ముడి పదార్థాల సేకరణ నుంచి ఫైనల్ ప్రాడక్ట్ వరకు.. ప్రతి దశలో నాణ్యత, ఆహార భద్రతకు సంబంధించిన అన్నిరకాల తనిఖీలు చేపడుతున్నామని నెస్లే ఇండియా పేర్కొంది. వినియోగదారులకు తమ ప్రాడక్ట్స్ చేరేలోగా అన్ని నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటించేలా పలుమార్లు తనిఖీలు నిర్వహిస్తునట్టు పేర్కొంది.
ఇవీ చదవండి:
‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్’.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
ఫోన్ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా