Share News

భర్తతో తరచూ గొడవలు.. ప్రియుడితో కలిసి హత్య..

ABN , Publish Date - Sep 19 , 2026 | 07:57 AM

భర్త తన మొదటి భార్యను కలవడం, ఆమెకు ఆర్థిక సహాయం చేయడంతో ఓ మహిళ అతన్ని అతి దారుణంగా హత్య చేయించింది. తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి కత్తులతో పొడిపించి ప్రాణాలు తీయించింది.

భర్తతో తరచూ గొడవలు.. ప్రియుడితో కలిసి హత్య..
Lucknow News

లక్నో: భర్త తన మొదటి భార్యను కలవడం, ఆమెకు ఆర్థిక సహాయం చేయడంతో ఓ మహిళ అతన్ని అతి దారుణంగా హత్య చేయించింది. తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి కత్తులతో పొడిపించి ప్రాణాలు తీయించింది. అనంతరం మృతదేహాన్ని ఓ వంతెన సమీపంలో పడేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో దక్షిణ ప్రాంతంలో చోటుచేసుకుంది.


పోలీసుల వివరాల ప్రకారం.. రామ్‌కిశోర్ వాల్మీకి, నిందితురాలు సుఫియా బానో రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. అయితే సుఫియా బానోకు మున్నా అలియాస్ ముచ్ఛడ్ (52)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం రామ్‌కిశోర్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ముఖ్యంగా రామ్‌కిశోర్ తన మొదటి భార్య కవితా దేవిని తిరిగి కలవడం, ఆమెకు ఆర్థికంగా సహాయం చేయడాన్ని సుఫియా బానో తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో భర్తను హత్య చేయాలని ఆమె తన ప్రియుడు మున్నా, అతని స్నేహితుడు మహ్మద్ ఇక్బాల్‌తో కుట్ర పన్నింది.


సెప్టెంబర్ 14 రాత్రి సుఫియా బానో పిలుపు మేరకు ఆమె ఇంటికి మున్నా, ఇక్బాల్‌ చేరుకున్నారు. రామ్‌కిశోర్ నిద్రిస్తుండగా వారిద్దరూ కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం సుఫియా బానో తన కుమారుడు(16)ని పిలిపించింది. నలుగురూ కలిసి రామ్‌కిశోర్ మృతదేహాన్ని ఓ చెక్క పెట్టెలో దాచారు. సెప్టెంబర్ 15 రాత్రి కనఖ ప్రాంతం భవఖాడ సమీపంలోని ఓ కాలువ వంతెన వద్ద పడేశారు. సెప్టెంబర్ 17న రామ్‌కిశోర్ మొదటి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. అనంతరం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

హైవేలపై పశువులు తిరిగితే యజమానులకు ఫైన్‌

9 మంది ఐసిస్‌ సభ్యులపై ఎన్‌ఐఏ చార్జిషీటు

Updated Date - Sep 19 , 2026 | 08:07 AM