9 మంది ఐసిస్ సభ్యులపై ఎన్‌ఐఏ చార్జిషీటు
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:28 AM
యువకులను ఉగ్రవాదంవైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఐసిస్ సంస్థకు చెందిన 9మందిపై విజయవాడ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసినట్టు శుక్రవారం ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: యువకులను ఉగ్రవాదంవైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఐసిస్ సంస్థకు చెందిన 9మందిపై విజయవాడ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసినట్టు శుక్రవారం ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో కుట్ర పన్ని సామాజిక మాధ్యమాల ద్వారా జిహాద్‌కు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. విజయవాడలోని ప్రత్యేక కోర్టులో మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సొహాయిల్ బేగ్, లక్కీ అహ్మద్, జిషాన్ అబ్దుల్ మజీద్, మీర్ అసిఫ్ ఆలీ, అబ్దుల్ సలాం, షారుక్ ఖాన్, షేక్ ఫయిజ్ ఉర్ రహ్మన్‌లపై పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్టు వివరించారు.