Share News

హైవేలపై పశువులు తిరిగితే యజమానులకు ఫైన్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:38 AM

హైవేలపై పశువులను విడిచిపెడితే యజమానులకు జరిమానాలు విధించాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. పశువుల కారణంగా ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.

హైవేలపై పశువులు తిరిగితే యజమానులకు ఫైన్‌
buffallos

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: హైవేలపై పశువులను విడిచిపెడితే యజమానులకు జరిమానాలు విధించాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. పశువుల కారణంగా ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది. పశువుల యజమానులను గుర్తించి జరిమానాలు విధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. పశువుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలను జీపీఎస్‌ ద్వారా గుర్తించి, ప్రతి 6నెలలకొకసారి సమీక్ష చేస్తుండాలని సూచించింది.

Updated Date - Sep 19 , 2026 | 05:44 AM