ఎన్‌టీఏ ఆఫీసును సందర్శిస్తాం: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:24 AM
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కార్యాలయాన్ని ఏ మేరకు ఆధునీకరించారన్న విషయాన్ని పరిశీలించేందుకు స్వయంగా తామే రావాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ శుక్రవారం అన్నారు. ఢిల్లీలోని మింటో రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసుకు వచ్చి అక్కడి ఏర్పాట్లను తాను, జస్టిస్ అరాధే వచ్చి తెలుసుకుంటామని చెప్పారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) కార్యాలయాన్ని ఏ మేరకు ఆధునీకరించారన్న విషయాన్ని పరిశీలించేందుకు స్వయంగా తామే రావాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ శుక్రవారం అన్నారు. ఢిల్లీలోని మింటో రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసుకు వచ్చి అక్కడి ఏర్పాట్లను తాను, జస్టిస్ అరాధే వచ్చి తెలుసుకుంటామని చెప్పారు. నీట్-యూజీ పేపర్ లీకేజీ, ఎన్‌టీఏ ప్రక్షాళన తదితర అంశాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఈ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనమే విచారణ జరుపుతోంది. ఎన్‌టీఏను పూర్తిగా ప్రక్షాళన చేశామని సొలిసిటర్ జనరల్ శుక్రవారం కోర్టుకు చెప్పడంతో జస్టిస్ నరసింహ ఈ వ్యాఖ్యలు చేశారు.