ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!
ABN , Publish Date - Nov 15 , 2026 | 09:10 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ తొలి వారంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు అధికార ఎన్డీయే కూటమి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.
ఢిల్లీ, నవంబర్15: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ తొలి వారంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు అధికార ఎన్డీయే కూటమి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌తోపాటు పలు బిల్లులను ఆమోదించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2029 ఎన్నికల నాటికి 33 శాతం మహిళా కోటా అమలు కోసం లోక్‌సభ స్థానాలను 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచేలా రాజ్యాంగ సవరణ బిల్లు చేయనుంది.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు తొలగించేందుకు 1971 జనాభా నిష్పత్తిని కొనసాగిస్తూ, అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచే ఫార్ములాపై ఇప్పటికే కేంద్రం కసరత్తు చేస్తోంది. లోక్‌సభలో ఈ బిల్లు నెగ్గాలంటే 361 ఓట్లు అవసరం ఉంది. అయితే ఎన్డీయేకు 320 మంది బలం ఉంది. దీంతో 15 నుంచి 18 ఓట్ల ఆధిక్యంతో నెగ్గుతామని ఎన్డీయే ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక సర్ (SIR) వివాదం, సీఈసీ రాజీనామా డిమాండ్‌తో శీతాకాల సమావేశాలను అడ్డుకునేందుకు విపక్ష ఇండియా కూటమి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడివాడలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 250 మంది
ఏఈఐ ర్యాంకింగ్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం: పట్టాభిరామ్
For More National News And Telugu News