Share News

పినరయి విజయన్ గెలుపు.. తగ్గిన ఆధిక్యం

ABN , Publish Date - May 04 , 2026 | 07:06 PM

కేరళంలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది.

పినరయి విజయన్ గెలుపు.. తగ్గిన ఆధిక్యం
Pinarayi Vijayan

తిరువనంతపురం: కేరళంలో పినరయి విజయన్ (Pinarayi Vijayan) సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ఓటమిని చవిచూసినప్పటికీ ధర్మాదం (Dharmadam) నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం ఇది మూడోసారి. అయితే గత రెండు పర్యాయాల్లో ఆయన సాధించిన ఆధిక్యం కంటే ఈసారి తగ్గింది. 19,247 ఓట్ల ఆధిక్యంతో ఈసారి ఆయన గెలుపొందారు.


రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్ ఈసారి కూడా తన నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు. ఆయనకు 85,614 ఓట్లు పోలయ్యాయి. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి వీపీ అబ్దుల్ రషీద్‌పై 19,247 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి 2016లో 36,000 ఓట్ల ఆధిక్యంతో, 2021లో 50,000 పైచిలుకు ఆధిక్యంతో విజయన్ గెలిచారు. ఈసారి ఆధిక్యం తగ్గడంతో పాటు తొలి రౌండ్లలో రషీద్ ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆ తర్వాత విజయన్ పుంజుకుంటూ ఎట్టకేలకు గెలుపును కైవసం చేసుకున్నారు. అయితే గెలుపు మార్జిన్ గమినిస్తే గత పదేళ్లలో ఇంత తక్కువ ఆధిక్యంతో ఆయన గెలవడం ఇదే మొదటిసారి.


ఇవి కూడా చదవండి..

హిమంత బిశ్వ శర్మ భారీ విజయం

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 04 , 2026 | 07:09 PM