Share News

కేరళలో భారీ పేలుడు.. పలువురి దుర్మరణం

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:20 PM

కేరళలో విషాదం నెలకొంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో పలువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో భారీ పేలుడు.. పలువురి దుర్మరణం
Kerala’s Thrissur blast

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచాలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే.. కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలవురు మృతిచెందారు. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.


త్రిస్సూర్‌‌ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో ఈ సంఘటన జరిగింది. ఈనెల 24న జరగాల్సిన నమూనా బాణసంచా కోసం ఆ కేంద్రంలో సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. తొలుత దీన్ని భూప్రకంపనలుగా భావించినట్టు వారు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

అయితే.. నల్లటి పొగలు, మరోసారి పేలుడు సంభవించిన కారణంగా సహాయక చర్యలు కష్టతరంగా మారాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఆ యూనిట్లో పేలని బాణసంచా పదార్థాలు ఇంకా ఉన్నాయనే అనుమానంతో.. అత్యంత జాగ్రత్తగా సహాయక కార్యకలాపాలు సాగుతున్నాయి. పేలుడుకు గల కచ్చితమైన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు.


ఇవీ చదవండి:

అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం

ఇరాన్‌కు చైనా సాయం.. ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం.?

Updated Date - Apr 21 , 2026 | 05:59 PM